Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం అనసూయ ఏదైనా చేస్తుందా? ఇలాంటి షోలకి అడ్డుకట్టే వేసేవారు లేరా?

Advertiesment
Anasuya expose

డీవీ

, శుక్రవారం, 28 జూన్ 2024 (16:06 IST)
Anasuya expose
జబర్దస్త్‌లో మగవారే ఆడవాళ్ళు గెటప్‌తో వచ్చేస్తున్నారు. రానురాను జుగుప్సాకరంగా తయారైంది. ఆ టైంలో నాగబాబు, రోజా కూడా భుజాన మోసారు కూడా. ఆ తర్వాత వీటిపై ట్రాన్స్‌జెండర్ కూడా తమ మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని వాపోయారు కూడా. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, భార్యా భర్తలు ఎఫైర్స్, కుళ్ళుతో వున్న స్కిట్లను రాసుకుని అదే టీవీ ప్రేక్షకులపై బలవంతంగా రుద్దుతున్నారు. దానితోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తోడయింది. 
 
ప్రముఖ ఛానల్ వీటిని ఎంకరేజ్ చేయడంతో పలువురు మండిపడ్డా, ఆ ఛానల్ కూడా ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోయింది. ప్రపంచంలో జరిగే వార్తల విశేషాలు చూడకుండా ఇంట్లోని వారంతా జబర్దస్త్ వంటిదానికి బానిసలుగా మారిపోయారు. ప్రపంచమంతా అభివృద్ధి పథంలో నడుస్తుండగా మన తెలుగు టీవీ రంగం మాత్రం దారుణంగా తయారైంది. 
 
2010 లోనే ఢిల్లీలోనే ఓ సంస్థ ఇలాంటి ప్రోగ్రామ్‌లపైన కేసు కూడా వేసింది. టీనేజ్‌లో వున్న పిల్లలు ఇలాంటివి చూడడంతో వారి బాడీపై హార్మోన్ల ప్రభావం చూపుతాయి. లేడీస్ త్వరగా మెచ్యూర్ అవుతారని, రకరకాల పోకడలు జరుగుతాయని తెలిపింది.
 
ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి వంటి ప్రోగ్రామ్ కొంచెం అడ్డుకట్టవేసింది. ఆ తర్వాత మరలా మామూలే అయింది. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్‌లపై తక్షణమే తగిన చర్యలు ప్రభుత్వంపరంగా టీవీ యాజమాన్యంపై తీసుకోవాలని ప్రముఖ సామాజిక వేత్త క్రిష్ణ కుమారి తెలియజేస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవలే టీవీలో వచ్చే కొత్త ప్రోగ్రాములో మిరపకాయలు తింటూ ఆ తర్వాత స్టేజీపై వున్న డాన్స్ మాస్టర్‌ను అనసూయ ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఇలా చేయడం కరెక్టేనా? అసలు సభ్యసమాజానికి ఏం చెప్పదలిచారని క్రిష్ణ కుమారి మండిపడింది. అందుకే ఇలాంటి సభ్యత లేని షోలు బుల్లితెరపై చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇలాంటివి పిల్లలపై తీవ్రప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే సినిమాల మాదిరిగా బుల్లితెరకూ సెన్సార్ వుండాలని తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ