Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 ఇయర్స్ ప్రుథ్వీకి మళ్ళీ ఎస్.వి.బి.సి. బాధ్యతలు?

Advertiesment
30 Years Prithvi

డీవీ

, మంగళవారం, 25 జూన్ 2024 (13:32 IST)
30 Years Prithvi
టాలీవుడ్ లో 30 ఇయర్స్ ప్రుథ్వీని అరెస్ట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆయనపై ఆయన భార్య కేసు వేసింది. త్వరలో అరెస్ట్ చేస్తున్నారంటూ మణికొండలో ఆయన ఇంటిముందు మీడియా హడావుడి చేసింది. దీనితో ఆయన బయటకు వచ్చి ఓ మీడియాకు వివరణ ఇచ్చారు. నేను సోషల్ మీడియాలో చూశాను. నాపై కేసులున్నాయి. అరెస్ట్ చేస్తారంటూ విని నవ్వుకున్నాను. ఇదంతా వై.సి.పి. వర్గాలు చేస్తున్నాయని అర్థమైంది.
 
వై.సి.పి.పై ఆయన మండిపడుతూ... చాలా మంది ఉసురుతోపాటు నా ఉసురుకూడా వారికి తగిలింది. తిరుమలలో ఎస్.వి.బి.సి బాధ్యతలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ నాకు అప్పగించారు. కానీ ఆయన సన్నిహితులు అనండీ, బంధువులు అనండీ.. వారే నన్ను టార్గెట్ చేసి అభాండాలు వేసి పదవినుంచి తప్పించేలా ప్లాన్ చేశాను. నాకు జరిాగింది చెబుదామంటే జగన్ అందుబాటులో వుండేవారు కాదు.
 
నేను పరమ భక్తుడిని. అలాంటి నాపై రకరకాల నిందలు మోపారు. ఓ దశలో మెంటల్ మానసిక క్షోభ అనుభవించాను.  ఆ టైంలోను తిరుమల కొండపైన ఆంజనేయ స్వామి పాదాల దగ్గర నా నిజాయితీ గురించి కాగితంపై రాసి నన్ను ఇబ్బంది పెట్టిన పార్టీ సర్వనాశనం అవ్వాలని కోరుకున్నాను. అది శ్రీనివాసుడు విన్నాడు. అందుకే నాలాగా ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఇక రోజా గురించి మాట్లాడడమే వేస్ట్.

ఎప్పటికైనా నేను మరలా ఎస్.వి.బి.సి ఛానల్ బాధ్యతలు చేపట్టాలి. నా నిజాయితీని నిరూపించుకోవాలి. ఆ దేవుని ఆశీస్సులు వుంటే ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబునాయుడుగానీ, పవన్ కళ్యాణ్ కానీ నాకు బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తున్నానంటూ పేర్కొనడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నివేతా థామస్ తో రానా దగ్గుబాటి నిర్మిస్తున్న చిత్రం పేరు 35-చిన్న కథ కాదు