Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బన్నీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నాను - హీరో శ్రీవిష్ణు

Advertiesment
బన్నీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నాను - హీరో శ్రీవిష్ణు
, మంగళవారం, 5 మే 2020 (20:56 IST)
హీరో శ్రీవిష్ణు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ... విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒక్కటే జిందగీ, మెంటల్ మదిలో.., నీది నాది ఒకటే కథ, తిప్పరా మీసం.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మెప్పించాడు. 
 
శ్రీవిష్ణు సినిమా అంటే... చాలా వైవిధ్యంగా ఉంటుంది అనే పేరు తెచ్చుకున్నాడు. అయితే... ఇటీవల మీడియాతో మాట్లాడిన  శ్రీవిష్ణు ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రేమ ఇష్క్ కాదల్..   సినిమా చూసిన తర్వాత బన్నీ ఫోన్ చేసి రమ్మాన్నాడట. అప్పుడు బన్నీ రేసుగుర్రం సినిమా షూటింగ్‌లో ఉన్నాడట. 
 
ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో అరగంట సేపు మాట్లాడట. ఇంతకీ బన్నీ ఏం చెప్పాడంటే.. రెగ్యులర్ హీరోలా కమర్షియల్ సినిమాలు చేయద్దు. విజయ్ సేతుపతి, కార్తికేయన్ల డిఫరెంట్ మూవీస్ చేయమని చెప్పాడని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫాలో అవుతున్నానని చెప్పాడు శ్రీవిష్ణు. భవిష్యత్‌లో మరిన్ని విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్..!