Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Mashooka పాటను రిలీజ్ చేయనున్న అల్లు అర్జున్.. రకుల్ థ్యాంక్స్

Allu Arjun
, గురువారం, 28 జులై 2022 (14:09 IST)
Allu Arjun
బన్నీ ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోసం రంగంలోకి దిగాడు. ఆమె నటించిన మాషుక అనే ప్రైవేట్ సాంగ్ లాంచ్ చేయనున్నాడు బన్నీ. 
 
ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ స్టెప్పులేయనుంది. చాలా కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న రకుల్. హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. 
 
తాజాగా ఈ అమ్మడు ఓ ప్రైవేట్ సాంగ్‏లో స్టెప్పులేసింది. మాషుక అనే ప్రైవేట్ స్పెషల్ చేసింది రకుల్. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. 
 
ఇక ఇప్పుడు మాషుక ఫుల్ సాంగ్‏ను జూలై 29న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా స్పెషల్ థాంక్స్ చెప్పింది రకుల్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు.. హౌస్‌లోకి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆయన ఎవరు?