బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రచారంలో మునిగి వుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా తనను తాను పబ్లిసిటీ చేసుకుంటోంది. ఆమె నటించిన బాలీవుడ్ సినిమా గంగూబాయి కతియావాడి` త్వరలో రాబోతుంది. ఇందులో వేశ్యగా నటించినట్లు ట్రైలర్‌నుబట్టి తెలుస్తోంది. అయితే గంగూబాయ్ కు చెందిన మనవడు ఆ బామ్మ వేశ్యకాదని సినిమాలో అలా చూపించడంపై కేసు పెడుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేశాయి. ఇక ఇదిలా ఉండగా, ఇటీవలే అలియా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు బెర్లిన్ నుండి తిరిగి రావడానికి ముందు అలియా భట్ కొన్ని తాజా పిక్స్ ను షేర్ చేసింది.
తాజాగా బాత్ టబ్ లో కూర్చుని అలియా చేసిన హాట్ ఫోటోషూట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. ఫాలోవర్స్‌ను కన్పిస్తూ, ఆమె చూస్తున్న అమాయకమైన చూపులు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ పిక్స్ కు “బైబై బెర్లిన్” అనే క్యాప్షన్ ను ఇస్తూ ఫ్యాన్స్ తో పంచుకుంది. అలియా భట్ వైట్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి దానితో పాటు బ్లేజర్ కూడా వేసుకుంది. వీటిని అభిమానులు చూసి ఫిదా అవుతున్నారు. ఇక ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్. కూడా త్వరలో విడుదలకాబోతుంది.