Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్​, ఎన్టీఆర్​ ల‌పై త‌న కోరిక‌ను తెలిపిన దీపికా

Advertiesment
అల్లు అర్జున్​, ఎన్టీఆర్​ ల‌పై త‌న కోరిక‌ను తెలిపిన దీపికా
, శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:44 IST)
Allu Arjun, NTR, Deepika
టాలీవుడ్​ స్టార్​ హీరోలు అల్లు అర్జున్​, ఎన్టీఆర్​తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె గెహ్రాహియా చిత్రంతో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న దీపికా తన మనసులో మాట‌ను వెల్ల‌డించింది.
 
అల్లు అర్జున్​, ఎన్టీఆర్​ సరసన పని చేయాలని ఉందని  మీడియాతో చెప్పేసింది. తారక్​ వ్యక్తిత్వం, నటన తననెంతో ఆకట్టుకున్నాయని ఆమె చెప్పింది. ఇప్పటికే ప్రభాస్​తో కలిసి 'ప్రాజెక్ట్​ కె' సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్​ హీరోయిన్స్​ టాలీవుడ్​ సినిమాల్లో ఎప్పటి నుంచో నటిస్తూ ఉండగా ఇప్పుడు ఆ ట్రెండ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకొణె, అనన్య పాండే మన హీరోలతో కలిసి పాన్​ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌న్‌ఫ్యూజ్ కిచిడిగా ర‌వితేజ ఖిలాడి - రివ్యూ రిపోర్ట్‌