Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలియా భ‌ట్, అజయ్ దేవగన్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌ల‌తో గంగూబాయి ట్రైల‌ర్‌

Advertiesment
Alia Bhatt
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (18:42 IST)
Alia Bhatt
కామాటిపురాలో అమావాస్య‌నాడుకూడా అంథ‌కారం వుండ‌దంటారు. ఎందుకంటే అక్క‌డ గంగూభాయ్ వుంటుంది. అనే డైలాగ్ తో గంగూబాయి కథియావాడి ట్రైల‌ర్ ఆరంభ‌మ‌యింది. మేమైతే రోజూ మానాన్ని అమ్మ‌కుంటాం. కానీ మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయిన‌ట్ట్టే.. అంటూ డైలాగ్‌లు అప్ప‌టి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై ఎక్కుపెట్టిన అస్త్రంలా అనిపిస్తాయి. ఈ ట్రైల‌ర్ ను ఈరోజే చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ   వీక్షకుల‌ను త‌న‌ విజువల్స్‌లో అనుభూతి చెందేలా చేస్తాడు. ఆయ‌న సినిమాలు రిచ్ లుక్ మరియు అనుభూతికి పర్యాయపదాలు. ఈ రోజు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో న‌టించిన గంగూబాయి కథియావాడి ట్రైలర్ విడుదలైంది.
 
webdunia
Ajay Devgan
1960 ద‌శ‌కంలోని కథ ఇది. 3 నిమిషాల కంటే తక్కువ నిడివి గల ఈ ట్రైల‌ర్‌లో ఆలియా భట్‌ను రచయిత-ఆధారిత పాత్రగా పరిచయం చేశారు. ఆమె అవమానాన్ని అహంకారంగా మార్చుకుంది. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. వేశ్య‌లు మరియు వారి కుటుంబాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చైతన్యంతో నిండి ఉంది. గంగూబాయి పాత్రలో ఆలియా భట్ చాలా చ‌క్క‌గా న‌టించింది. ఇక అజయ్ దేవగన్ గంగూబాయి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మాఫియా డాన్ కరీం లాలాగా క‌నిపించాడు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.
 
బన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. గంగూబాయి కథియావాడి సినిమా 25 ఫిబ్రవరి, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ చ‌ర‌ణ్ లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్‌