Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేశారు ... హనీమూన్ ఎక్కడో చెప్పండి : నటి త్రిష

Advertiesment
trisha

ఠాగూర్

, శనివారం, 11 అక్టోబరు 2025 (10:53 IST)
తనకు ప్రజలే పెళ్లి చేశారని, అలాగే హానీమూన్ ఎక్కడో చెప్పాలని సినీ నటి త్రిష కోరారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. చంఢీగఢ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరుగనుందంటూ కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను వ్యంగ్యంగా తిప్పికొట్టారు. ఈ మేరకు శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 
 
'నా జీవితం గురించి ఇతరులు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్‌ను కూడా ఎప్పుడు షెడ్యూల్ చేస్తారా అని ఎదురుచూస్తున్నా' అంటూ త్రిష తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సెటైర్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టంచేశారు. కొంతకాలంగా త్రిష, సదరు వ్యాపారవేత్త కుటుంబాలకు మంచి పరిచయం ఉందని, త్వరలోనే వీరు ఒక్కటవబోతున్నారని పుకార్లు షికారు చేశాయి.
 
ఈ నెల ఆరంభం నుంచి త్రిష వరుసగా కొన్ని ఇబ్బందికర సంఘటనలు ఎదుర్కొంటున్నారు. కేవలం వారం రోజుల క్రితమే, చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆమె నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్నిఫర్ డాగ్స్ ఆమె ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఆ బెదిరింపు బూటకమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇక వృత్తిపరంగా చూస్తే, త్రిష కెరీర్ ప్రస్తుతం బలంగా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది చిన్నారులను, ప్రతి ఒక్కరిలో ఉండే చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఆకట్టుకునే ఒక చందమామ కథలా ఉంటుందని చిరంజీవి ఇదివరకే
తెలిపారు. 
 
దీంతోపాటు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన 'కరుప్పు' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా త్రిష నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇలా ఒకవైపు వ్యక్తిగత జీవితంపై వదంతులు, మరోవైపు అనుకోని సంఘటనలు ఎదురవుతున్నా, త్రిష మాత్రం తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించి ముందుకు సాగుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్