Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Advertiesment
Sarath Kumar

చిత్రాసేన్

, శుక్రవారం, 10 అక్టోబరు 2025 (18:07 IST)
Sarath Kumar
కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తిశ్వరన్ గారు డ్యూడ్ కథ చెప్పారు. కథ అద్భుతంగా వుంది. ప్రదీప్ కి అంకుల్ గా కనిపిస్తాను. నా పాత్ర కథలో చాలా క్రూషియల్. చాలా కొత్త పాయింట్. ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక మేటర్ జరిగితే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందనే కోణంలో డైరెక్టర్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు అని శరత్ కుమార్ తెలిపారు.
 
లవ్ టుడే, డ్రాగన్‌ చిత్రాల్లో నటించిన ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రేమలు తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్ కుమార్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. చాలా డిఫరెంట్ షేడ్స్ వుంటాయి. అలాంటి క్యారెక్టర్ ని ప్లే చేయడం కూడా చాలా డిఫికల్ట్. నా క్యారెక్టర్ కి వున్న రూల్స్, కండీషన్స్ డిఫరెంట్ గా వుంటాయి. మంచి కాన్ఫ్లిక్ట్ వుంటుంది.
 
-అందరూ టెక్నికల్ గా సౌండ్ వుంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైయింది. ఇప్పటి డిజిటల్ టెక్నాలజీకి తగ్గట్టు మేకర్స్ అప్డేట్ అవుతూ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు. మంచి కథలు, పాత్రలు చేయాలనే తపనే ఎప్పుడూ వుంటుంది.
 
- షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు మానిటర్ చూస్తుంటారు. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకి ఓకే కాకపొతే మరో టేక్ చెబుతారు. అంతేకానీ యాక్టర్స్ ప్రతిసారి వెళ్లి మానిటర్ చూడటం సమయం వృధా అని నా భావన.
 
 - సాయి అభ్యంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా ట్యాలెంటెడ్ కంపోజర్. ఈ సినిమాకి తన మ్యూజిక్ బిగ్ ఎసెట్. 
 
- ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటాం. వరలక్మి డైరెక్టర్ అవుతుంది. ఇంకా ఆ కథ చెప్పలేదు. 
 
- నాకు సుభాస్ చంద్రబోస్ బయోపిక్ చేయాలని వుంది. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను.
 
- అప్  కమింగ్ ప్రాజెక్ట్స్ ... మిస్టర్ ఎక్స్ అనే సినిమా చేస్తున్నాను. అలాగే నవంబర్ లో ఒక సినిమా రిలీజ్ కి వుంది. బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే గౌతమ్ మీనన్ తో కలసి ఒక సినిమా చేస్తున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్