Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను 45 సార్లు అలా వాడేశారు... RX 100 హీరోయిన్ పాయల్ రాజ్

ఆర్‌ఎక్స్ 100. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కిన చిత్రం ఇది. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువ ప్రేక్షకులు ఎగబడి మరీ చూశారు. సినిమాలో 45కి పైగా కిస్‌లు, హగ్‌లు ఉన్నాయి. హ

Advertiesment
నన్ను 45 సార్లు అలా వాడేశారు... RX 100 హీరోయిన్ పాయల్ రాజ్
, శుక్రవారం, 3 ఆగస్టు 2018 (14:39 IST)
ఆర్‌ఎక్స్ 100. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. కొత్త హీరోహీరోయిన్లతో తెరకెక్కిన చిత్రం ఇది. రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువ ప్రేక్షకులు ఎగబడి మరీ చూశారు. సినిమాలో 45కి పైగా కిస్‌లు, హగ్‌లు ఉన్నాయి. హీరోహీరోయిన్లు కలిసేటప్పుడల్లా హీరో బటన్లు ఊడదీయం లాంటి సీన్లు ఇందులో ఉన్నాయి. ఇది కాస్తా యువ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమా మంచి హిట్ సాధించి డబ్బులు బాగానే వచ్చాయి కానీ హీరోయిన్‌కు మాత్రం ప్రతిఫలం ముట్టలేదట. 
 
ఆర్ఎక్స్ -100 సినిమాలో హీరో కార్తికేయ. హీరోయిన్ పాయల్ రాజ్. వీరిద్దరూ కొత్తవారే. సినిమా మొత్తం బూతు పురాణమేనని మహిళా సంఘాలన్నీ సినిమా విడుదల నుంచి గగ్గోలు పెడుతూ వచ్చాయి. హీరోయిన్ 45 సార్లు హీరోకు ముద్దులు పెడుతుంది. అంతేకాదు గట్టిగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగదు. రకరకాల భంగిమలను చూపిస్తుంటుంది. ఇదంతా కేవలం తను సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకే అంటోంది పాయల్ రాజ్. 
 
సినిమాలో నటించేందుకు కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నానని, దర్శకుడు అజయ్ భూపతి తనను బాగా సినిమాలో వాడేశాడని, దానికి నేను బాధపడలేదు కానీ.. సినిమా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉందంటోంది పాయల్. తన నెక్ట్స్ మూవీ నుంచి మాత్రం రెమ్యునరేషన్‌ను బాగా పెంచేస్తున్నానని చెబుతోంది. టాలీవుడ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే ముఖ్య ఉద్దేశమంటోంది పాయల్ రాజ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాళ్ల వరకూ జారీపోయిన జెన్ని జీన్స్ ప్యాంట్