Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుకుమార్ 1940 స్టోరీకి షాక్ అయిన మహేష్ బాబు... ఏం చెప్పాడంటే...

Advertiesment
సుకుమార్ 1940 స్టోరీకి షాక్ అయిన మహేష్ బాబు... ఏం చెప్పాడంటే...
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (20:10 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంటే... అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం విశేషం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 
 
ఈ మూవీని సమ్మ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే... ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్, సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం తెలిసిందే. అయితే.. సుకుమార్ మ‌హేష్ బాబుకి 1940 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే స్టోరీ చెబితే నో చెప్పాడ‌ట‌.
 
ఇటీవ‌ల సుకుమార్.. మ‌హేష్‌కి వేరే స్టోరీ వినిపించాడ‌ట‌. ఈ క‌థ మ‌హేష్‌కి న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం సుకుమార్ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. మార్చిలో ఈ సినిమాని ప్రారంభించాల‌నుకుంటున్నార‌ట‌. వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో మ‌హేష్‌కి సుకుమార్ ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. మ‌రి.. ఈసారైనా సుకుమార్ మ‌హేష్‌కి బ్లాక్ బ‌ష్ట‌ర్ అందిస్తాడో లేదో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 25న అఖిల్ అక్కినేని-వెంకీ ‘మిస్టర్ మజ్ను’