సూపర్ స్టార్ మహేష్ బాబు - సక్సస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం మహర్షి. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ సరసన పూజా హగ్డే నటిస్తుంటే... కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక అసలు విషయానికి వస్తే... ఈ చిత్రంలో మాత్రం మహేష్ మరోసారి తన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు అని తెలుస్తుంది.
ఎందుకంటే ఈ చిత్రంలో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు అని సమాచారం. బిజినెస్ మ్యాన్‌గా, స్టూడెంట్‌గా మరియు మరో ముఖ్య పాత్ర ఒక సాధారణ రైతుగా కనిపించబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మహేష్ అభిమానులకు పండగే.