Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా ఆర్ట్స్‌లో మ‌హేష్ బాబు సినిమా ఏమైంది..?

Advertiesment
గీతా ఆర్ట్స్‌లో మ‌హేష్ బాబు సినిమా ఏమైంది..?
, గురువారం, 13 డిశెంబరు 2018 (21:23 IST)
సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఇది మ‌హేష్ కి 25వ చిత్రం. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సమ్మ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ సంస్థ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వచ్చాయి. అంతేకాకుండా ఈ భారీ చిత్రానికి అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు అనే వార్త కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
అయితే.. మ‌హేష్ మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత సుకుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ మూవీ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగాతో మ‌హేష్ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. అయితే.. సందీప్ రెడ్డి ద‌గ్గ‌ర మ‌హేష్‌తో మూవీ చేసేందుకు ఫుల్ స్ర్కిప్ట్ లేద‌ట‌. 
 
అందుచేత గీతా ఆర్ట్స్ సంస్థ వేరే రైట‌ర్‌తో క‌థ రాయిస్తుంద‌ని తెలిసింది. వేరే క‌థ‌ను డైరెక్ట్ చేసేందుకు సందీప్ రెడ్డి ఓకే చెప్పాడ‌ట‌. అయితే... మ‌హేష్-సందీప్ కాంబినేష‌న్లో రూపొందే మూవీ కోసం క‌థ రాస్తున్న రైట‌ర్ ఎవ‌రు..? ఇది ఏ త‌ర‌హా చిత్రం అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దర్శకుడికి ఫోన్ చేసి ఆపకుండా తిట్టిన సునీల్.. ఎందుకు?