Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్ చ‌ర‌ణ్ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడా?

Advertiesment
రామ్ చ‌ర‌ణ్ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తున్నాడా?
, బుధవారం, 30 అక్టోబరు 2019 (22:34 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కు సైరా సినిమా బిజీలో ఉన్నాడు. ఇక ఇప్ప‌టి నుంచి త‌ను న‌టించే త‌దుప‌రి చిత్రాలపై దృష్టి పెడుతున్నాడ‌ట‌. చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు చాలామంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే చ‌ర‌ణ్ కూడా కొంతమంది ద‌ర్శ‌కులకు మాట ఇచ్చాడు. అలా.. చ‌ర‌ణ్ మాట ఇచ్చిన వారిలో విక్ర‌మ్ కుమార్ ఒక‌రు. 
 
అవును.. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చాడ‌ట చ‌ర‌ణ్‌. విక్ర‌మ్ కుమార్ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు క‌థ రెడీ చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇష్క్, మ‌నం, 24 చిత్రాల‌తో విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా విక్ర‌మ్ కుమార్ మంచి పేరు సంపాదించారు. అయితే... ఇటీవ‌ల తెర‌కెక్కించిన హ‌లో, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. 
 
అయిన‌ప్ప‌టికీ చ‌ర‌ణ్ విక్రమ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ క‌థపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లో చ‌ర‌ణ్‌కి స్టోరీ చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. రామ్ చ‌ర‌ణ్ - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్లో సినిమా రావ‌చ్చు అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి... చ‌ర‌ణ్ ఇచ్చినమాట ప్ర‌కారం విక్ర‌మ్‌తో సినిమాకి సై అంటాడో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమంత్.. కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్