పునర్నవి హైపర్ పిల్ల... ఇంటికి రా.. అమ్మ రొయ్యల కూర చేసింది..(video)

గురువారం, 24 అక్టోబరు 2019 (16:31 IST)
బిగ్ బాస్ హౌస్‌లో మంచి స్నేహితులైన వితికా షెరు, పునర్నవి ఇద్దరూ ఎలిమినేషన్‌తో బయటికి వచ్చేశారు. పునర్నవి బిగ్ హౌస్ నుంచి బయటికి రావడంతో పార్టీలు, పబ్‌లు, బీచ్‌ల చుట్టూ తిరుగుతుంటూ వితిక మాత్రం లైవ్ వీడియోస్ ఇస్తూ వుంది. ఇలా తాజాగా ఓ లైవ్ వీడియోలో వితిక మాట్లాడుతూ.. పునర్నవి గురించి చెప్పుకొచ్చింది. పునర్నవి హైపర్ పిల్ల అని చెప్పుకొచ్చింది. 
 
చిన్నపిల్లలు వుంటే ఇల్లెలా వుంటుందో.. బిగ్ బాస్ హౌస్ కూడా అలానే వుండేదని చెప్పింది. ఇక వితిక లైవ్‌లో వుండగా.. పునర్నవి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చింది దీనిపై వితిక మాట్లాడుతూ, పున్ను ఫోన్లు, కామెంట్లు వద్దు. ఇంటికి రా త్వరగా అమ్మ రొయ్యల కూర చేసింది. తిందాం. అంటూ ఆహ్వానించింది. హౌస్‌లో పున్ను వుంటే అల్లరి అల్లరిగా సందడి సందడిగా వుండేదని చెప్పుకొచ్చింది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మంజువారియర్ ఆరోపణలు.. శ్రీకుమార్ స్పందన.. ఏమన్నారంటే?