ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ హీరా తాజాగా 'పద్మభూషణ్' అవార్డు పొందిన కోలీవుడ్ హీరో అజిత్ కుమార్‌పై సంచలనం ఆరోపణలు చేశారు. తనపై డ్రగ్ అడిక్ట్ అనే ముద్ర వేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని వాడుకుని వదిలివేశాడని సంచలన ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన బ్లాగ్‌లో రాసిన ఓ సుధీర్ఘ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్ట్‌ను చూసిన అజిత్ అభిమానులు హీరోయిన్ హీరాపై మండిపడుతున్నారు.
వివరాలను పరిశీలిస్తే, నటి హీరా తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఓ తమిళ నటుడుతో తనకున్న సంబంధం గురించి, అతని వల్ల ఎదురైన అనుభవాల గురించి విపులంగా రాసుకొచ్చారు. ఆ పోస్టులో ఆమె ఏ నటుడు పేరునూ ఆమె నేరుగా ప్రస్తావించలేదు. అయితే, అందులోని అంశాలు మాత్రం అజిత్‌ను సూచించేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓ నటుడుతో తాను సహజీవనం చేశానని, అతనికి వెన్నెముక సమస్య వచ్చినపుడు ఆస్పత్రిలో సేవలు అందించినట్టు చెప్పారు. ముఖ్యంగా సినీ కెరీర్‌లో కూడా అండగా నిలిచినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత తనపై డ్రగ్ ఎడిక్ట్ అనే అబద్ధపు ముద్ర వేసి దూరం పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, గత 1996లో అజిత్, హీరాలు కలిసి 'కాదల్ కోట్టై' అనే చిత్రంలో నటించగా, ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది సహజీవనానికి దారితీసిందని అప్పట్లో వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారనే ప్రచారం ఉంది. 1999లో అమర్కలం సినిమాలో తనతో నటించిన షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.