టాలీవుడ్ హీరోయిన్ సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె వీరాభిమాని ఒకరు మరుపురాని బహుమతి ఇచ్చాడు. తమ అభిమాన హీరోయిన్‌కు ఏకంగా గుడికట్టించాడు. ఈ గుడిని ప్రారంభించడంతో పాటు పలువురుకి అన్నదానం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి తమ అభిమాన హీరోయిన్ సమంత పేరుపై గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఈ విషయాన్ని సందీప్ మీడియాకు వెల్లడించారు. దీనిపై సందీప్ మాట్లాడుతూ, సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె చేసే సేవా కార్యక్రమాలను కూడా బాగా ఇష్టపడతానని, అందుకే ఆమెకు అభిమానిని అయ్యానని తెలిపాడు. ప్రతి యేడాది సమంత పుట్టిన రోజున అనాథాశ్రమాల్లో అన్నదానం కూడా చేస్తానని చెప్పాడు.