Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

Advertiesment
Muthaiya trailer poster

దేవీ

, సోమవారం, 28 ఏప్రియల్ 2025 (17:57 IST)
Muthaiya trailer poster
కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. హేమంత్ కుమార్ సిఆర్ అసోసియేట్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.  మే 1వ తేదీ నుంచి 'ముత్తయ్య' సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది.
 
ఈ రోజు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ సంయుక్తంగాా 'ముత్తయ్య' సినిమా ట్రైలర్  రిలీజ్ చేశారు. ముత్తయ్య మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని ఈ సందర్భంగా రాజమౌళి అభినందించారు. మూవీ టీమ్ కు ఆయన తన బెస్ట్ విశెస్ అందించారు.
 
"ముత్తయ్య" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - నటుడు కావాలనేది 60 ఏళ్ల ముత్తయ్య కల. తమ ఊరైన చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ చేస్తాడు. నాటకాల్లో బాగా డైలాగ్స్ చెప్పే ముత్తయ్యకు మంచి నటన ప్రతిభ ఉంటుంది. కానీ సినిమా నటుడు కావాలంటే అంత సులువు కాదు. అతని కల నెరవేర్చుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందదు. ఇలాంటి పరిస్థితులన్నీ తట్టుకుని ముత్తయ్య నటుడు కాగలిగాడా, ఏదో ఒక రోజు ఊరి ప్రజలకు తను నటించిన సినిమా పెద్ద తెరపై చూపించాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేది ట్రైలర్ లో హార్ట్ టచింగ్ గా చూపించారు. కలను వెంటనే నెరవేర్చుకోవాలి, లేదంటే అప్పుడే చంపేసుకోవాలి, కానీ వెంటపెట్టుకుని తిరగకూడదు అంటూ ముత్తయ్య చెప్పే డైలాగ్ అతని క్యారెక్టర్ పడే మానసిక సంఘర్షణను చూపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు