ఇటీవలి పూజా హెగ్డేకు తెలుగు సినిమాలో పెద్ద ఆఫర్లు దొరకడం లేదు. ఆమె టాలీవుడ్ కెరీర్ మందగించింది. తమిళ పరిశ్రమ ఆమెకు కొత్త అవకాశాలను రావడంతో ఫ్యాన్స్ మళ్ళీ ఆశలు పెట్టుకున్నారు. ఆమె ప్రస్తుతం విజయ్‌తో కలిసి జన నాయగన్‌లో నటిస్తోంది. అలాగే లారెన్స్ కాంచన-4లో కూడా ఆమె కీలక పాత్రకు సంతకం చేసినట్లు టాక్ వస్తోంది.
అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ధనుష్ తదుపరి చిత్రానికి కూడా పూజా పేరును పరిశీలించినట్లు సమాచారం. ప్రారంభ చర్చలు బాగానే జరిగాయని సమాచారం. అయితే, చివరి నిమిషంలో పరిస్థితులు మారిపోయాయి. పూజ స్థానంలో సాయి పల్లవిని మేకర్స్ తీసుకున్నారు.
దీంతో పూజా హెగ్డేకు చేతికి వచ్చిన ఛాన్స్ చేజారిపోయింది. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయని సినీ పండితులు అంటున్నారు. ఇక సాయి పల్లవి గతంలో మారి 2లో ధనుష్‌తో కలిసి పనిచేసింది. వారి రౌడీ బేబీ పాట భారీ పాన్ ఇండియా హిట్ అయింది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం రామాయణంపై దృష్టి పెట్టింది. ఇందులో ఆమె సీత పాత్ర పోషిస్తుంది.
ఈ కారణంగా ఆమె థండేల్ తర్వాత ఎక్కువ తెలుగు లేదా తమిళ చిత్రాలకు సంతకం చేయలేదు. అయినప్పటికీ ఆమె ధనుష్ 55వ చిత్రానికి అంగీకరించింది. ఇకపోతే.. పూజా హెగ్డే ప్రస్తుతం జన నాయగన్, కాంచన 4, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న బాలీవుడ్ చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై కోసం ఎదురు చూస్తోంది.