Balkrishan 106 film opeing
ఈమధ్య అగ్రహీరోల సినిమాలు దసరానాడు ప్రారంభోత్సవాలు జరగనున్నాయని ప్రకటించారు నిర్మాణ సంస్థలు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. అందుకు రకరకాల కారణాలు చెబుతున్నా అసలు కారణంవేరుగా వుందని సినివర్గాలు తెలియజేస్తున్నారు. నటీనటులును ఎవరినైనా పెట్టుకోవచ్చు. కానీ అనుభవం వున్న టెక్నీషియన్లు దొరకడం కష్టంగా వుందని తెలుస్తోంది.
దర్శకుడు బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో సినిమాకు సెంథిల్ ను కెమెరామెన్ గా అనుకున్నారట. కానీ మిరాయ్ సినిమా రిజల్ట్ చూశాక ప్రత్యేకించి ఆ చిత్ర దర్శకుడు సినిమాటోగ్రాఫీర్ కార్తీక్ ఘట్టమనేని కావాలని హీరో పట్టుపట్టినట్లు తెలిసింది.
మరోవైపు నందమూరి బాలక్రిష్ణ సినిమా మలినేని గోపీచంద్ తో ప్రారంభించాల్సి వుంది. కానీ ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. దసరాకు అనుకున్న సినిమాను అక్టోబర్ 24న లాంఛింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం నిర్మాతలు అధిక బడ్జెట్ తో సినిమా చేయడం కష్టమని తప్పుకున్నట్లు తాజా సమాచారం. అందుకే ఆ నిర్మాతలు నానితో సినిమాను ప్రకటించారు. మరోవైపు మలినేని గోపీచంద్, బాలక్రిష్ణ సినిమాకు సీనియర్ సినిమాటోగ్రాఫర్ కోసం వెతుకున్నారు.
ప్రస్తుత పరిస్థితులో కొన్ని చిత్రమైన పోకడలవల్ల అనుభవం వున్న వారు ముందుకు రావడంలేదు. తమిళ సినిమాటోగ్రాఫర్ల బిజీగా వుండడంతోపాటు ఇతర కారణాలతో ఆ సినిమాకు యువకుడైన సినిమాటోగ్రాఫర్ కోసం వెతుకుతున్నారు. ఆ యూత్ కెమెరామెన్ ఇప్పటికే ఓ సినిమాలో కమిట్ అయ్యాడు. మరి బాలయ్య కోసం రావాలంటే కష్టమే. ఆయనెవరనేది పాఠకులు గ్రహించే వుంటారు. సో. ఇలా అగ్ర హీరోల సినిమాలు వారి వల్లే వాయిదా పడడం విశేషమే.