Raj Tarun trusts Chiranjeevi
పలు వివాదాలమధ్య నటుడిగా కెరర్ సాగిస్తున్న రాజ్ తరుణ్ కు ఈమధ్య సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయి. అయినా ఆయనతో ఓ ఓటీటీ సినిమాను స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. ఈ చిత్రానికి చిరంజీవి అని పేరు పెట్టారు. ఆహా ఓటీటీ ఒరిజినల్ ఫిల్మ్ చిరంజీవ. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ తో ఆకట్టుకుంది. శివ (రాజ్ తరుణ్) కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్ ను కూడా జెట్ స్పీడ్ తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్ గా చేరమని సలహా ఇస్తారు. అలా ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ. శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్ తో తెలుస్తోంది.