Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ram Charan: ఢిల్లీలో రావణ దహనం చేసి ఆర్చరీ క్రీడాకారులకు స్పూర్తినింపిన రామ్ చరణ్

Advertiesment
Ramcharan at new delhi

చిత్రాసేన్

, శనివారం, 4 అక్టోబరు 2025 (09:17 IST)
Ramcharan at new delhi
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (APL)ను దసరా శుభ సందర్భంగా  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గ్రాండ్ గా లాంచ్ చేయడంతో న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చారిత్రాత్మక క్రీడా వేడుక ప్రారంభమైంది. అద్భుతమైన ప్రారంభోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు.
 
వేలాది మంది అభిమానుల మధ్య రామ్ చరణ్ చేసిన రావణ దహనం కార్యక్రమం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. మగధీర, “రంగస్థలం”, ఆస్కార్ గెలిచిన “RRR” లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రామ్ చరణ్, ఈ వేదికపై తన ఆప్యాయ స్వభావంతో అందరి మనసును గెలుచుకున్నారు.
 
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే కాక ప్రపంచంలో తొలిసారి ఆర్చర్ల కోసం ప్రీమియర్ లీగ్  నిర్వహించడం ఆనందంగా వుంది. ప్రతి క్రీడాకారుడిని, ప్రతి ఆర్చర్‌ని మనం ప్రోత్సహించాలి. ఈ ఆటలో ఉన్న ఫోకస్‌, క్రమశిక్షణ, బలం నిజంగా అభినందనీయమైనవి. ఈ లీగ్ విజయానికి మనమందరం అండగా నిలవాలి.
 
ఆరంభ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, లీగ్ ఆంథమ్ ఆవిష్కరణ, జట్ల వాక్‌అవుట్లు, రామ్ చరణ్ నేతృత్వంలో జరిగిన రావణ దహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
విజనరీ, ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ అనిల్ కామినేని ఈ కలను నిజం చేయడానికి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖలను ఒకచోట చేర్చారు. అతని నాయకత్వంలో, APL కేవలం ఒక క్రీడా లీగ్‌గా కాకుండా ప్రపంచ స్థాయి పోటీలను మిళితం చేసే సాంస్కృతిక వేడుకగా నిలుస్తోంది.
 
యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో (అక్టోబర్ 2–12, 2025) లైట్ల మధ్య ఆరు ఫ్రాంచైజీ జట్లు, 36 మంది భారతదేశంలోని అత్యుత్తమ ఆర్చర్లు, 12 మంది అంతర్జాతీయ స్టార్లు తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో పోటీ పడుతుండగా,  APL భారత క్రీడా రంగానికి కొత్త గుర్తింపుని ఇస్తూ, ఆర్చరీకి ఒక కొత్త దిశ చూపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కుమార్తె న్యూడ్ ఫోటోలు అడిగారు: నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన