Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి పొట్టలో దూది మరిచిన వైద్యులు.. ఎక్కడ?

Advertiesment
deadbody
, బుధవారం, 23 ఆగస్టు 2023 (15:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్యులు చేసిన చేసిన పనికి ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. ఈ నెల 15వ తేదీన ఓ మహిళకు ప్రసవం చేసిన వైద్యులు.. అదేరోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేశారు. ఇంతవరకు బాగానే వుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ తర్వాత పొట్టలోనే దూది పెట్టి కుట్లు వేశారు. తీవ్ర ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో పాటు వారం రోజుల తర్వాత ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో బాలింత మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బాలింత మరణానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనని వారు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట దర్శన్ గడ్డ తండాకు చెందిన రోజా అనే అనే మహిళ గర్భందాల్చి నెలలు నిండటంతో ఈ నెల 15వ తేదీన ప్రసవం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆ రోజే ఆ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ రోజే ఆమెకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక ఆమె కడుపులో దూది పెట్టి మరిచిపోయారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చారు. 
 
అయితే, ప్రసవం వల్ల కలిగిన నొప్పిగా భావించి వారు పెద్దగా పట్టించుకోలేదు. పైగా, రోజురోజుకూ నొప్పి ఎక్కువ కావడంతో పాటు ఆమె తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఈ నెల22వ తేదీన మరోమారు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 
 
అయితే, అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కడుపులో ఉంచిన దూది వల్లే రోజా మరణించినట్టు బంధువులు ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసుల అక్కడకు చేరుకుని మృతురాలి బంధువులను శాంతపరిచారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరికొన్ని నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్ ల్యాండర్