Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన బి-లైవ్

Advertiesment
image
, మంగళవారం, 22 ఆగస్టు 2023 (23:13 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ-బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ BLive, తెలంగాణలో తమ 6వ BLive మల్టీ-బ్రాండ్ ఎక్స్పీరియన్స్ స్టోర్‌ గ్రావిటీ ఎంటర్‌ప్రైజెస్, ప్లాట్ నెం.29-30, ఓంకార్ నగర్, సాగర్ రోడ్, బైరామల్‌గూడ, హైదరాబాద్ వద్ద ప్రారంభించింది, తద్వారా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరించింది.
 
హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ప్రారంభించడం గురించి BLive సీఈఓ & కో-ఫౌండర్ సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ “ దేశంలోనే మా మొట్టమొదటి స్టోర్‌ని ప్రారంభించడం ద్వారా మేము మా ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నగరంలో కొత్త స్టోర్‌ను ప్రారంభించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ విస్తరణ మాకు రెండు విషయాలకు దగ్గర చేస్తుంది- మార్పును స్థిరత్వం వైపు నడిపించడం మరియు BLive EV స్టోర్‌లలో విస్తరణతో EVల స్వీకరణను వేగవంతం చేయడం. 2024 నాటికి 100 స్టోర్‌ల లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యం వైపు మేము నమ్మకంగా పయనిస్తున్నాము." అని అన్నారు 
 
రివోల్ట్ మోటార్స్‌తో భాగస్వామ్యంపై తన ఆలోచనలను పంచుకుంటూ “రివోల్ట్ మోటార్స్‌తో చేతులు కలపడం మరియు విప్లవాత్మకమైన రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను BLive EV స్టోర్‌లకు పరిచయం చేయడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, EVకి మారుతున్నప్పుడు మోటర్‌సైక్లింగ్ యొక్క ఆహ్లాదకరమైన మరియు థ్రిల్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని మేము మా వినియోగదారులకు తెలియజేయాలనుకుంటున్నాము..." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ- తెలంగాణలోని విద్యార్థులకు విదేశీ విద్యకై కేంద్రంగా నిలిచిన యూఎస్ లోని యూజీ కోర్సులు: కెరీర్ మొజాయిక్