ఆయుష్మాన్ భారత్‌లో తిరకాసు వుందని అందువల్లే కరోనా వైరస్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. పేదలను గుర్తించటంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో అనేక లోటుపాట్లతో పాటు తిరకాసులు ఉన్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
'80 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ నుంచి లబ్ధి పొందుతున్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ వలన లబ్ధిపొందేది కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే. పేదలను గుర్తించటంలో తిరకాసులు ఉన్న ఆయుష్మాన్ భారత్.. పేదలందరికి కరోనా వైద్యం అందించలేదు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం' అని షర్మిల పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం చేరిన విషయం తెలిసిందే.