Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. బ్లాక్ మెయిల్.. అత్యాచారం..

Advertiesment
Tealangana
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయో బేధాలు లేకుండా వావివరుసలు లేకుండ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత స్నానం చేస్తుండగా చాటుగా వీడియో తీసిన ఓ కామాంధుడు బ్లాక్‌మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వేమనపల్లి మండలంలోని సూరారం గ్రామంలో జరిగింది. 
 
గ్రామానికి చెందిన రసపెల్లి మధు అనే యువకుడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లో వీడియో తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో పరువు పోతుందన్న భయంతో బాధితురాలు అతడికి లొంగిపోయింది. 
 
దీన్ని అవకాశంగా తీసుకుని ఆ కామాంధుడు అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినా వేధింపులు తాళలేకపోవడంతో బాధితురాలు తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో అతడు భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదు.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి : సీఎం యడ్యూరప్ప