18 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!

మంగళవారం, 16 జులై 2019 (08:57 IST)
ఈ నెల 18వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
 
కొత్త మున్సిఫల్ చట్టానికి సంబంధించి అసెంబ్లీ, శాసనమండలిలో  తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించనున్నారు.  రెండు రోజుల తర్వాత శాసనసభ సమావేశాలు  వాయిదా పడే అవకాశం ఉంది. 
 
కొత్త మున్సిపల్ ముసాయిదా బిల్లు తయారైంది. ఈ బిల్లును న్యాయ శాఖకు పంపారు.  ఈ బిల్లును శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన వెంటనే ఎన్నికలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ, మండలిలో టీఆర్ఎస్‌కు మెజార్టీ ఉంది. దీంతో  ఈ బిల్లు పాస్ కావడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పట్టాలు ఎక్కనున్న బెంగళూరు-విజయవాడ ప్యాసింజరు