Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హలో చాహర్... సిరాజ్‌లా ఆడుతున్నావే? ధోనీ క్లాస్, సూపర్ కింగ్స్ విక్టరీ

Advertiesment
హలో చాహర్... సిరాజ్‌లా ఆడుతున్నావే? ధోనీ క్లాస్, సూపర్ కింగ్స్ విక్టరీ
, శనివారం, 6 ఏప్రియల్ 2019 (20:59 IST)
అదే కోహ్లీకి ధోనీకి వున్న తేడా అంటూ ఇప్పుడు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం గురించి తర్వాత చెప్పుకుందాం కానీ శనివారం నాడు చెన్నై చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2019 పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవన్ జట్టుపైన 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది చెన్నై. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 20 ఓవర్లకి 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 
 
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని కింగ్స్ లెవన్ పంజాబ్ ఆదిలో దూకుడుగా ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ చాహర్‌కి చుక్కలు చూపించారు. దీనితో ధోనీ ఆలోచనలో పడ్డాడు. అతడిని పిలిచి ఏదో చెప్పాడు. అదే ఇదేనంటూ కొందరు నెటిజన్లు ఇలా పేర్కొంటున్నారు. 'హలో చాహర్... నువ్వేంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ సిరాజ్‌లా మారావా ఏంటి' అని అన్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనికి కారణం చాహర్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇవ్వడమే. ఐతే ఎలాగో పగడ్బందీగా ఆడేసి కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు పరుగులు తీయకుండా చేసేశాడు ధోనీ. దీనితో ఆ జట్టుకి పరాజయం తప్పలేదు.  
 
ఇక సిరాజ్ విషయానికి వస్తే... 
జట్టులో విజయానికి బాటలు వేయాల్సిన ఆటగాడే ఓటమి కారణమవుతుంటే పరిస్థితి ఎలా వుంటుంది.? జట్టు కెప్టెన్ కుతకుతలాడిపోడూ... అలాంటి పరిస్థితినే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎదుర్కొన్నాడు. 205 పరుగుల భారీ స్కోరు చేసిన కోహ్లీ సేన... ఐపీఎల్ 2019 సీజన్లో మంచి విజయం ఖాయం అనుకున్నాడు. ఐతే అతడి ఆలోచనలను గింగరాలు తిప్పాడు కోహ్లీ సేనలోనే వున్న హైదరాబాదీ యువ బౌలర్ మహ్మద్ సిరాజ్. 
 
అసలు విషయానికి వస్తే.. శుక్రవారం నాడు ఐపీఎల్ 2019 సీజన్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే 3 ఓవర్లలో వాళ్లు 53 పరుగులు చేయాల్సి వుంది. ఇది మామూలు విషయం కాదు. ఇక విజయం మనదే అనే ఉత్సాహంతో కోహ్లి ఓ తీసుకున్న నిర్ణయం అతడి జట్టు విజయాన్నే మార్చేసింది. మహ్మద్ సిరాజ్‌కు బంతి ఇచ్చి బౌలింగ్ చేయమన్నాడు. 
 
ఇంకేం.. సిరాజ్ వేస్తున్న ఒక్కో బంతికి చుక్కలు కనబడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ కేవలం 13 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు కొట్టాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిరాజ్ బంతి ఎప్పుడు వేస్తాడా... దాన్ని ఎప్పుడు సిక్స్ కొట్టాలా అని రసెల్ ఎగబడ్డాడంటే అతిశయోక్తి కాదు. ఇలా సిరాజ్ వేసిన ఓవర్లలో ప్రత్యర్థి జట్టు సిక్సర్లు వుతికి గెలిచే జట్టును ఓడిపోయేలా చేసేశాడు.
 
అంతేనా, ఫీల్డింగులో రెండు కీలక క్యాచులను కూడా జార విడిచాడు. దీనితో కోహ్లి సేనకు ఎప్పటిలాగే అపజయం వరించింది. కాగా ఈ సిరాజ్ హైదరాబాదుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు. ఇతడి ఆట తీరును చూసిన బెంగళూరు ఫ్రాంఛైజీ రూ. 2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసింది. ఇతడేమో ఇదిగో ఇలా చేశాడు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ. 2.6 కోట్ల హైదరాబాదీ కుర్రాడు... కోహ్లీ సేనను కుళ్లబొడిచి ఓడించాడు...