Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. 2.6 కోట్ల హైదరాబాదీ కుర్రాడు... కోహ్లీ సేనను కుళ్లబొడిచి ఓడించాడు...

రూ. 2.6 కోట్ల హైదరాబాదీ కుర్రాడు... కోహ్లీ సేనను కుళ్లబొడిచి ఓడించాడు...
, శనివారం, 6 ఏప్రియల్ 2019 (16:06 IST)
జట్టులో విజయానికి బాటలు వేయాల్సిన ఆటగాడే ఓటమి కారణమవుతుంటే పరిస్థితి ఎలా వుంటుంది.? జట్టు కెప్టెన్ కుతకుతలాడిపోడూ... అలాంటి పరిస్థితినే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎదుర్కొన్నాడు. 205 పరుగుల భారీ స్కోరు చేసిన కోహ్లీ సేన... ఐపీఎల్ 2019 సీజన్లో మంచి విజయం ఖాయం అనుకున్నాడు. ఐతే అతడి ఆలోచనలను గింగరాలు తిప్పాడు కోహ్లీ సేనలోనే వున్న హైదరాబాదీ యువ బౌలర్ మహ్మద్ సిరాజ్. 
 
అసలు విషయానికి వస్తే.. శుక్రవారం నాడు ఐపీఎల్ 2019 సీజన్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే 3 ఓవర్లలో వాళ్లు 53 పరుగులు చేయాల్సి వుంది. ఇది మామూలు విషయం కాదు. ఇక విజయం మనదే అనే ఉత్సాహంతో కోహ్లి ఓ తీసుకున్న నిర్ణయం అతడి జట్టు విజయాన్నే మార్చేసింది. మహ్మద్ సిరాజ్‌కు బంతి ఇచ్చి బౌలింగ్ చేయమన్నాడు. 
 
ఇంకేం.. సిరాజ్ వేస్తున్న ఒక్కో బంతికి చుక్కలు కనబడ్డాయి. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ కేవలం 13 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు కొట్టాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సిరాజ్ బంతి ఎప్పుడు వేస్తాడా... దాన్ని ఎప్పుడు సిక్స్ కొట్టాలా అని రసెల్ ఎగబడ్డాడంటే అతిశయోక్తి కాదు. ఇలా సిరాజ్ వేసిన ఓవర్లలో ప్రత్యర్థి జట్టు సిక్సర్లు వుతికి గెలిచే జట్టును ఓడిపోయేలా చేసేశాడు.

అంతేనా, ఫీల్డింగులో రెండు కీలక క్యాచులను కూడా జార విడిచాడు. దీనితో కోహ్లి సేనకు ఎప్పటిలాగే అపజయం వరించింది. కాగా ఈ సిరాజ్ హైదరాబాదుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు. ఇతడి ఆట తీరును చూసిన బెంగళూరు ఫ్రాంఛైజీ రూ. 2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసింది. ఇతడేమో ఇదిగో ఇలా చేశాడు మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ విమర్శిస్తే చంపేస్తా.. ఆర్‌సీబీ అభిమాని హెచ్చరిక..