Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభినందన్ విడుదలవుతాడా? లేదా? జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?

Advertiesment
అభినందన్ విడుదలవుతాడా? లేదా? జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?
, గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:39 IST)
పాకిస్థాన్ సైనికుల చెరలో ఉన్న భారత వైమానిక దళానికి చెందిన విగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇపుడు సురక్షితంగా విడుదలవుతాడా? లేదా? అన్న సందేహం ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఆయన విడుదలకు ఎవరు సహాయం చేస్తారన్న చర్చ ఇపుడు సాగుతోంది. 
 
ఈనెల 27వ తేదీ బుధవారం పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసే క్రమంలో భారత మిగ్ విమానం కూడా కూలిపోయింది. కానీ ఆ విమానం పైలట్ మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడి పాకిస్థాన్ సైనికులకు చిక్కాడు. దీంతో అభినందన్ ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద బందీగా ఉన్నాడు. 
 
సాధారణంగా యుద్ధ సైనికులు పట్టుబడితే జెనీవా ఒప్పందాలు తెరమీదకు వస్తాయి. ఇవే అత్యంత కీలకంగా మారుతాయి. అసలీ జెనీవా ఒప్పందం ఏంటీ? యుద్ధ సమయంలో పట్టుబడిన సైనికులు యుద్ధ ఖైదీలు అని పిలుస్తుంటారు. వీరిని ఎలా చూడాలి? ఎలాంటి రక్షణ కల్పించాలని తదితర హక్కుల గురించి ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది. 
 
ఈ ఒప్పందం మేరకు యుద్ధ ఖైదీలకు జాతి, మత, లింగ ప్రాంత వివక్షలకు తావు ఉండదు. సైనికులు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో సాయం అందించాల్సి ఉంటుంది. హింసించడం, దాడులు చేయడం చేయకూడదు. న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి ఎలాంటి శిక్షలు విధించవద్దు. వారు గాయపడి, గాయపడకపోయినా వైద్య పరీక్షలు చేయించాలి. 
 
ఇకపోతే, జెనీవా రెండో ఒప్పందం నౌకాదళానికి, ఇతర నేవీ దళాలకు వర్తిస్తుంది. యుద్ధంలో సైనికులు కాకుండా సామాన్య పౌరులు పట్టుబడితే ఎలా? దానిపై కూడా ఒప్పందంలో ఉంది. సైనికుల మాదిరిగానే వీరికి రక్షణలూ కల్పించాలి. వారి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఒప్పందంలో పేర్కొంది. 
 
సముద్రాల్లో పట్టబడితే వారికి ఓడల్లోనే వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. వారిని కూడా క్షేమంగా చూడాలి. యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన వ్యక్తి నుంచి కేవలం పేరు, వారి ర్యాంకు, నంబర్ మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా సమాచారం రాబట్టేందుకు వీలులేదు. హింసించడం, శారీరకంగా, మానసికంగా హింసలకు గురిచేయరాదని స్పష్టంగా ఒప్పందంలో పొందుపరిచింది. 
 
మరి ఇపుడు అభినందన్ వర్ధమాన్ విషయంలోనూ జెనీవా ఒప్పందాలు మరోమారు తెరపైకి వచ్చాయి. ఈ ఒప్పందానికి లోబడి అభినందన్‌ను పాకిస్థాన్ విడుదల చేస్తుందా లేదా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒకవేళ ఒప్పందాన్ని బేఖాతర్ చేసి అభినందన్‌ను విడుదల చేయని పక్షంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తృటిలో అద్భుతాన్ని చేజార్చుకున్న వెస్టిండీస్