Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీడీపీఆర్ అంటే ఏమిటి.. సమాచార భద్రత సాధ్యమేనా?

సీఆర్ఐఎఫ్ హైమార్క్ ద్వారా జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. డేటా సంరక్షణ కోసం ఈ ఏడాది మే 25న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాల్లో అమలులోకి వచ్చిన జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌-జీడీపీఆర్‌ ప్రపంచ వ్యాప

జీడీపీఆర్ అంటే ఏమిటి.. సమాచార భద్రత సాధ్యమేనా?
, మంగళవారం, 19 జూన్ 2018 (13:22 IST)
సీఆర్ఐఎఫ్ హైమార్క్ ద్వారా జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. డేటా సంరక్షణ కోసం ఈ ఏడాది మే 25న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాల్లో అమలులోకి వచ్చిన జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌-జీడీపీఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపనుంది. తద్వారా ఈయూ దేశాల్లో డేటా రక్షణ చట్టాల్లో జీడీపీఆర్‌ మైలురాయిగా నిలువనుంది. 
 
జీడీపీఆర్ అంటే ఏమిటి?
ఈయూలోని పౌరుల డేటా రక్షణ హక్కులను ప్రమాణీకరించడానికి, బలోపేతం చేసేందుకు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సహకరిస్తుంది. ఈయూలోని అన్ని రంగాల్లోని కంపెనీలు, వాటికి కాల్‌ సెంటర్‌ వంటి సేవలను అందించే కంపెనీలు వారికి లభించిన వినియోగదారుల సమాచారాన్ని ఇష్టానుసారంగా వినియోగించడానికి వీలుండదు. ప్రస్తుతం వినియోగదారుల నుంచి ఒక సారి అనుమతి తీసుకుని కంపెనీలు పొందే వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలు తమ మార్కెటింగ్‌, అమ్మకాల వ్యూహాల రూపకల్పనకు వినియోగించుకుంటున్నాయి.

లక్ష్యిత వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఈ సమాచారాన్ని ఇతర కంపెనీలకు కూడా విక్రయించుకుంటున్నాయి. కొత్తగా అమలులోకి వచ్చిన జీడీపీఆర్ నిబంధనలు డేటా సేకరణ, వినియోగం మొదలైన అన్నింటిపై మార్గదర్శకాలను సూచిస్తాయి.
 
ఇది ఎవరికి వర్తిస్తుందంటే..?  
ఈయూ పౌరుల వ్యక్తిగత డేటాను నిర్వహించేందుకు, నిల్వచేసేందుకు లేదా ప్రాసెస్ చేసేందుకు తోడ్పడుతుంది. ఈయూ పౌరుల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ఈయూ కానీ కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది. 
 
వ్యక్తిగత డేటా అంటే ఏమిటి?
జీడీపీఆర్‌కు వ్యక్తిగత డేటా హృదయం లాంటిది. పర్సనల్ డేటా అంటే వ్యక్తికి సంబంధించిన.. ఒక వ్యక్తిని గుర్తించదగిన సమాచారం. ఐడెంటి అంటే జన్యుపరమైన, బయోమెట్రిక్, ఆరోగ్యం, జాతి, ఆర్థిక స్థితి, రాజకీయ అభిప్రాయాలు, ఐపీ చిరునామా మొదలైనవి వ్యక్తిగత సమాచారం కిందకు వస్తాయి. వీటిని సంరక్షించేందుకే జీడీపీఆర్ అమల్లోకి వచ్చింది. 
 
జీడీపీఆర్‌ను స్వీకరించాల్సిన అవసరం ఎందుకంటే?
జీడీపీఆర్‌ను స్వీకరించడం ద్వారా సైబర్ భద్రతా ప్రక్రియ సులువవుతుంది. సైబర్ భద్రతా ప్రక్రియలను పునరాలోచించవలసిన అవసరాన్ని గుర్తించి, సంస్థల కోసం జీడీపీఆర్‌ను డిజైన్ చేశారు. ఇది డేటా గోప్యతకు కీలకమైంది. ప్రతి సంవత్సరం డేటా ఉల్లంఘనకు దారితీసే ప్రమాదం నుంచి జీడీపీఆర్ సాయంతో గట్టెక్కవచ్చు. తద్వారా డేటాకు చెందిన సంస్థల వివరాలు గోప్యంగా వుంటాయి. ఇది డిజైన్ విధానం ద్వారా గోప్యతను అనుసరిస్తుంది.  వాటిని వెంటనే గుర్తించి, పరిష్కరించడానికి సహాయపడుతుంది.
 
జీడీపీఆర్‌ను స్వీకరించడం ద్వారా ప్రయోజనాలేంటి?
* సైబర్‌ను బలోపేతం చేయడం సులభం
* బెటర్ డేటా మేనేజ్మెంట్‌ సాధ్యమవుతుంది. 
* మార్కెటింగ్ రిటన్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ఆర్ఓఐ)ని పెంపొందించవచ్చు.  
* అలా పెంపొందించిన ఆడియన్స్ నమ్మకాన్ని పొందవచ్చు. 
* కొత్త వ్యాపార సంస్కృతిని పొందవచ్చు. 
 
భారతదేశానికి, భారతీయ కంపెనీలకు జీడీపీఆర్ పనికొస్తుందా?
జీడీపీఆర్ ద్వారా భారత దేశానికి, భారతీయ కంపెనీలకు ఎంతో అవసరం. ఈ కొత్త చట్టం భారత వ్యాపారంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. గోప్యత, డేటా సంరక్షణలో భారతదేశ చట్టపరమైన విధానాన్ని కలిగి ఉంటుంది. జీడీపీఆర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు వారి నిబంధనలనుగోప్యతా విధానాలను మార్చుకుంటాయి. భారతదేశంలో ఇప్పటికీ అవసరం కానప్పటికీ, జీడీపీఆర్ నోటిఫికేషన్‌ను పొందుతున్నారు. 
 
చాలా భారతీయ సంస్థలు జీడీపీఆర్‌చే ప్రభావితం కానప్పటికీ, ఐటీ, ఇన్సోర్సింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి కొన్ని భారతీయ రంగాలు జీడీపీఆర్ చేత ఈయూ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా దెబ్బతినే అవకాశం వుంది. జీడీపీఆర్‌లోని కన్సల్టింగ్, ఆడిటింగ్ సేవలను అందించే వ్యక్తులకు, రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఇది ఓ కొత్త అవకాశంగా ఉపయోగపడుతుంది.
 
ఈయూ దేశాలకు చెందిన ప్రజల డేటా వినియోగంలో కంపెనీలు తప్పకుండా ఈ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల పాటు జీడీపీఆర్‌పై ఈయూ కసరత్తు చేసింది. ఉదాహరణకు ఈయూ దేశాల్లోని కంపెనీ కాల్‌ సెంటర్‌ సేవల కేంద్రం భారత్‌లో ఉంటే ఆ కాల్‌ సెంటర్‌ కంపెనీ కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా సమాచారాన్ని ఉంచాలి. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చాలా కంపెనీలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. 
 
డిజిటల్‌ లావాదేవీలు, బిట్‌ కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు ప్రాచుర్యం పెరుగుతున్నందున సైబర్‌ నేరాలు పెరిగే అవకాశం ఉందని.. వీటిని కట్టడి చేయడానికి సైబర్‌ భద్రత సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే జీడీపీఆర్‌ను వినియోగించుకోవాల్సి వుంటుంది. భారత్‌కు చెందిన అనేక ఐటీ కంపెనీలు యూరప్‌లోని కంపెనీలకు ప్రొఫైలింగ్‌, బిహేవియరల్‌ అనలిటిక్స్‌ వంటి సేవలను అందిస్తున్నాయి.

ఈ కంపెనీలన్నీ జీడీపీఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. ఈ ప్రభావం ఐటీ కంపెనీలపై ఉండగలదు, కొన్ని కంపెనీలు యూరప్‌ నుంచి వచ్చే వ్యాపార అవకాశాలను వదులుకోవాల్సిన పరిస్థితి రావచ్చునని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు గడ్డం పెరిగింది. గొంతుకూడా మగవారిలా వుంది.. విడాకులు?