ఆమె ట్రైనీ ఎస్.ఐ. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో ఎస్ఐగా పదోన్నతి రాబోతోంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్లో ఎస్ఐతో కలిసి పనిచేస్తోంది. కేసులు ఎలా రాయాలో.. వచ్చిన కేసులను ఎలా టేకప్ చేయాలో తెలుసుకుంటోంది. అయితే కేసుల గురించి చెప్పాల్సిన ఆ ఎస్ఐ కామాంధుడి అవతారమెత్తాడు.
కేసుల గురించి ఇంకా బాగా చెబుతానంటూ పిలిపించుకుని ట్రైనీ ఎస్ఐని రేప్ చేశాడు. న్యాయం కోసం వెళితే దళిత మహిళ కావడంతో న్యాయం చేయడం లేదంటూ బాధితురాలు ఆరోపిస్తోంది.
వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన ఒక ట్రైనీ మహిళా ఎస్ఐని కేసు గురించి వివరిస్తానంటూ ఎస్సై శ్రీనివాస్ పిలిపించుకున్నాడు. ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు.
విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ట్రైనీ ఎస్ఐ కావడంతో ఏమాత్రం భయపడకుండా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు తెలిపింది. కానీ ఉన్నతాధికారులు ఆ కేసును సీరియస్‌గా తీసుకోలేదు.
దీంతో ఆ మహిళా ఎస్ఐ వరంగల్ సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. తాను ఒక పోలీస్‌గా ఉంటే తనకే న్యాయం జరగక్కపోతే సామాన్యులకు ఇంకేం న్యాయం జరుగుతుందంటూ ఆందోళనకు దిగింది.