Publish Date: Sat, 11 Dec 2021 (11:40 IST)
Updated Date: Sat, 11 Dec 2021 (11:42 IST)
శునకంతో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ కేసులో ఏడేళ్ల తర్వాత ముగ్గురిని దోషులుగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో నివసించే ప్రశాంత్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు.
ఓ రోజు అది శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లడంతో దానిని అతడు కొట్టి తరిమేశాడు. తాను పెంచుకుంటున్న శునకాన్ని కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రశాంత్ శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నాడు.
శ్రీనివాస్‌పై పగ తీర్చుకోవాలని భావించాడు. అంతే శ్రీనివాస్‌ను ప్రశాంత్ చంపేశాడు. దీనికోసం స్నేహితుల సాయం కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజాగా, వీరిని దోషులుగా తేల్చిన సంగారెడ్డి రెండో అడిషనల్ జిల్లా కోర్టు ముగ్గురికీ జీవిత ఖైదుతోపాటు రూ. 5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
సెల్వి
Publish Date: Sat, 11 Dec 2021 (11:40 IST)
Updated Date: Sat, 11 Dec 2021 (11:42 IST)