Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనగామ ఆరోగ్యకేంద్ర రికార్డు.. ఒకే రోజు 16 సుఖప్రసవాలు

Advertiesment
జనగామ ఆరోగ్యకేంద్ర రికార్డు.. ఒకే రోజు 16 సుఖప్రసవాలు
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (06:27 IST)
నవమాసాలు నిండాయంటే చాలు.. కాన్పు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటారు. పురిటి నొప్పులు మొదలయ్యాయంటే.. నొప్పులు తట్టుకోలేని వారి బాధను చూడలేని కుటుంబ సభ్యులు ఆపరేషన్​ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇకపై అలాంటి అవసరం ఉండదని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప... సిజేరియన్​ అవసరంలేదని చెబుతున్నారు వైద్యులు. సుఖ ప్రసవాలతోనే మహిళల ఆరోగ్యానికి రక్ష అని చెప్పడమే గాక చేసి చూపిస్తున్నారు. తొమ్మిది నెలలు నిండాయంటే ఎప్పుడెప్పుడు కాన్పవుతుందా అని మహిళలు ఎదురుచూస్తుంటారు.

సాధారణ ప్రసవం అంటే నొప్పికి భయపడి సిజేరియన్​ను ఆశ్రయిస్తున్నవారు ఎంతో మంది. కానీ వీటి వల్ల ప్రసవం అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యలపై వారు దృష్టి సారించడం లేదు.

ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపుతున్నారు జనగామ జిల్లా వైద్యులు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పిస్తూ మహిళలు సాధారణ ప్రసవాల వైపే మొగ్గుచూపేందుకు కృషి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రో​ ధరలు మరింత పైపైకి