Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెట్రో​ ధరలు మరింత పైపైకి

Advertiesment
పెట్రో​ ధరలు మరింత పైపైకి
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (06:25 IST)
చమురు సంక్షోభంతో.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో లీటర్​ పెట్రోల్​ ధర ఏకంగా రూ.80కి చేరువలో ఉంది.

అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో వరుసగా ఎనిమిదో రోజు దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. లీటర్ డీజిల్​ ధర 14 పైసలు పెరిగింది.

ప్రస్తుతం రూ.67.07 వద్ద ఉంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో లీటర్​ పెట్రోల్ ధర రూ.80కి చేరువలో ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.70 దాటింది. నరగాల వారీగా పెట్రో ధరలు.. నగరం పెట్రోల్(లీ) డీజిల్​(లీ) ముంబయి రూ.79.77 రూ.70.34 హైదరాబాద్ రూ.78.77 రూ.73.08 చెన్నై రూ.77.03 రూ.70.88 కోల్​కతా రూ.76.79 రూ.69.46.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన.. ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదార్లు చేసిన డ్రోన్​ దాడితో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మొదలైంది. ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా 5శాతం ఉత్పత్తి తగ్గి.. ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

నెలాఖరుకు ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ఆరాంకో ప్రతినిధులు చెబుతున్నా చమురు ధరలపై అనిశ్చితులు తొలగటం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోయలేని భారంగా నేటి చదువులు