Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెరాసకు మరో బిగ్ షాక్ తగలబోతుందా? మాజీమంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా?

Advertiesment
big shock for TRS
, శుక్రవారం, 11 మార్చి 2022 (22:00 IST)
తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెరాస అధిష్టానానికి షాకివ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన తెరాస కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భాజపాలో చేరుతారనే వార్తలు వచ్చాయి.

 
వీటికి బలం చేకూర్చేవిధంగా శుక్రవారం నాడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో పర్యటించారు. ప్రజల్లో కలియతిరుగుతూ తన రాజకీయ జీవితంపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు, ప్రజల సలహాలు, సూచనలతో ముందడుగు వేస్తానని తెలియజేసారు.

 
జూపల్లితో పాటు పలువురు కిందిస్థాయి నాయకులు కూడా ఆయనతో పాటు భాజపాలో చేరుతారని జోరుగా చర్చ జరుగుతోంది. మరి జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ భూభాగంలో 100 కి.మీ లోపలికి దూసుకెళ్లిన ఇండియన్ క్షిపణి... ఏమైంది?