Publish Date: Fri, 11 Mar 2022 (11:46 IST)
Updated Date: Fri, 11 Mar 2022 (11:49 IST)
శుక్రవారం 11 గంటలకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే బిజీ షెడ్యూల్ కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వాయిదా పడిందని సీఎంవో కార్యాలయం వెల్లడించింది.
కాగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవంలో కేసీఆర్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి వుంది. ఐతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ నెల 28న యాదాద్రి దేవాలయం కుంభాభిషేకం జరుగనుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు చేస్తున్నారు.