Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థిని ప్రాణం తీసిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

Advertiesment
Inter Results
తెలంగాణాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఫలితాల్లో కేవలం 49 శాతంమంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలపై పైచేయిగా నిలిచింది. 
 
అయితే, ఈ ఫలితాలను చూసిన తర్వాత అనేక మంది విద్యార్థులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఏం రాసినా పాస్ చేస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు.. అనేక మంది విద్యార్థులను ఫెయిల్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. 
 
ఓ విద్యార్థి అయితే, ఏకంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లను ట్యాగ్‌ చేస్తూ ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ విద్యార్థి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 
 
ఇదిలావుంటే నల్గొండ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ నగర్‌ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థినికి ఇంటర్‌లో తక్కువగా మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒసాకా నగరంలో భారీ అగ్నిప్రమాదం - 27 మంది సజీవదహనం