తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల రుణమాఫీకి ఆమోదం పలికింది. దీంతో ఈ ఏడాది రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి రుణమాఫీని ప్రభుత్వం చేపట్టనుంది. రూ.50వేల లోపు రుణాలు ఉన్న రైతులకు ఈనెలాఖరులోగా నిధులను ఖాతాలో జమ చేయనుంది.
కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలో 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు పంట రుణ మాఫీ వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్‌కు అందజేసింది.
తెలంగాణలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం అధికారులతో చర్చించారు. కరోనా వల్ల అనాథలైన పిల్లల వివరాలు ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
అలాగే, మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ.25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేశాం.
ఆగస్టు 15 నుంచి రూ.50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.
ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రిమండలి చర్చించింది. ఈ ఆసుపత్రుల సత్వర కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై మంత్రిమండలి సభ్యులు చర్చించారు. త్వరలో వీటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.