Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు అరుదైన గౌరవం.. ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకులకు చీఫ్ గెస్ట్‌గా...

isb - chandrababu
, శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:59 IST)
హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో గత 20 యేళ్ల క్రితం నెలకొల్పిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇది 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. 1999లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఐఎస్‌బీకి శంకుస్థాపన చేయగా 2001 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది.
 
ఇపుడు ఈ దిగ్గజ విద్యా సంస్థకు 20 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు స్కూలు అధికారులు ముఖ్య అతిథిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సంస్థ ఏర్పాటులో చందగ్రబాబు కృషికి గుర్తింపుగానే ఈ ఆహ్వానం లభించింది. దీంతో చంద్రబాబు ఈ వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2023 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే...