తెలంగాణ రైతుల పట్ల కేంద్రం ఎట్టకేలకు కరుణించింది. ధాన్యం కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే, ఆ మాటలను లిఖత పూర్వకంగా ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం పట్టుబట్టింది.
ఈ నేపథ్యంలో ఖరీప్‌సు సంబంధించి తెలంగాణా రాష్ట్రంలోని పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పంష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది. తెలంగాణాలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీన రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తూ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. బియ్యం సేకరణ లక్ష్యం పెంపుదలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఆ లేఖలో పెట్టింది. ఈ క్రమంలో తాజాగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనుంది.