అటు తెలంగాణాలోని నాగార్జున సాగర్లో, ఇటు ఆంధ్రలోని శ్రీశైలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరదతో ప్రస్తుత నీటిమట్టం 553 అడుగులుకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ఇన్ ఫ్లో 2,77 640 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 29,862 క్యూసెక్కులు కు చేరింది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 216.4350 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉంటుంది.
ఇటు కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 4,99,816 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 4,34,850 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884,40 అడుగులు నీటి మట్టం చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 211.9572 టీఎంసీలుంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా: 14.700 మిలియన్ యూనిట్స్
ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 14.116 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని