Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’

వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‌’
, శుక్రవారం, 30 జులై 2021 (11:27 IST)
ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో వివరించారు.

సందేశ్‌కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. ‘సందేశ్ ఓపెన్ బేస్డ్ యాప్. ఇది చాలా సురక్షితమైనది. క్లౌడ్ ఎనేబుల్ అయిన ఈ యాప్‌కు సంబంధించిన కంట్రోల్‌‌‌ను ప్రభుత్వమే చూసుకుంటుంది.

వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్‌ లాంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్‌లో కూడా దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం’ అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 
 
వాట్సాప్‌లా పని చేసే సందేశ్‌ను నేషనల్ ఇన్ఫోర్‌‌మెటిక్స్ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డెవలప్ చేసింది. ఎన్‌ఐసీతోపాటు ప్రభుత్వ ఐటీ వింగ్ కలసి ఈ యాప్‌ను లాంచ్ చేశాయి.

మొబైల్ నెంబర్‌తోపాటు ఈమెయిల్ ఐడీతోనూ కమ్యూనికేట్ చేసుకునేలా సందేశ్‌ను డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు వాడుతున్న ఈ యాప్‌ ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.

ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక.. ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే చాలు యాప్‌ను వినియోగించుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎప్పటివరకు అంటే...