Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్

Advertiesment
Lady Aghori

సెల్వి

, సోమవారం, 29 సెప్టెంబరు 2025 (12:49 IST)
Lady Aghori
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకుంది. ఆపై  అఘోరీని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అఘోరి జైలులో ఉన్న సమయంలో వర్షిణికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
వర్షిణి ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో మరోసారి వీరి వ్యవహారం వెలుగుచూసింది. వర్షిణి ఎవరో తెలియదని అఘోరి, అఘోరి ఎవరో తెలియదని వర్షిణి ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో వర్షిణి తనపై వస్తున్న విమర్శలకు సెల్ఫీ వీడియోలో సమాధానం ఇస్తూ అఘోరీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తాను డబ్బుల కోసం అఘోరీ వెంట వెళ్లాననడంతో అర్థం లేదని ఆమె కొట్టి పడేసింది. అసలు అఘోరీ వద్ద పెట్రోల్‌కు కూడా డబ్బులు లేవని స్పష్టం చేసింది. పోలీసులు అరెస్ట్‌ చేసినపుడు కూడా కారులో ఎలాంటి డబ్బులు దొరకలేదని తెలిపింది. కేవలం తను చెప్పిన విషయాలు నిజమని నమ్మి అతనితో వెళ్లినట్లు వర్షిణి తెలిపింది. 
 
అఘోరీ తొలి పెళ్లి గురించి అబద్ధం చెప్పిందని.. తను చెప్పిన విషయాలన్ని నమ్మినట్లు వర్షిణి వివరించింది. దాని తర్వాత మనం పెళ్లి చేసుకుందామని, పెళ్లి చేసుకుంటే వారికి సమాధానం ఇచ్చినట్లు ఉంటుందని నమ్మించాడని తెలిపింది. అతనితో జరిగింది అసలు పెళ్లే కాదని.. అఘోరీతో వెళ్లి చాలా పెద్ద తప్పు చేశానని వర్షిణి వెల్లడించింది. తను ట్రాప్‌ చేసి మోసం చేశాడని ఆరోపించింది.
 
సరే జరిగిందేదో జరిగిందని నేను రియలైజ్‌ అయి ఇంటికొస్తే అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వర్షిణి తెలిపింది. తాను అన్ని వదిలేసి ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నాను. ఇటువంటి సమయంలో అఘోరీ చేసిన కామెంట్స్‌కు మాత్రమే తాను సమాధానం ఇచ్చినట్లు వర్షిణి చెప్పుకొచ్చింది.
 
"అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? అంటూ వర్షిణి ఏకిపారేసింది. అఘోరీ వల్ల తన కుటుంబం ఇబ్బందుల్లో పడింది. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అల్లూరి శ్రీనివాస్‌ అంటూ ఫైర్ అయ్యింది. నిజాలు మాట్లాడు లేదంటే.. చెప్పుతీసుకుని కొడతా.. ఇంకోసారి .. నా గురించి, నాఫ్యామిలీ గురించి మళ్లీ మాట్లాడితే... నీ అంగం కోసేస్తా అఘోరీ.. దమ్ముంటే నాతో డైరెక్ట్‌గా మాట్లాడు" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వర్షిణి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోంవర్క్ చేయలేదని విద్యార్థిని తాడుతో తలకిందులుగా వేలాడదీసి చెంపదెబ్బలు కొట్టించాడు