హైదరాబాద్, నరూర్ నగర్‌లో 10 మంది హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్ పీ అండ్ టీ కాలనీలో నివాసం ఉంటూ ఆ ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా ఈ హిజ్రాలు మార్చేశారు. రాత్రి పూట రోడ్లపై వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేయసాగారు. ఈ హిజ్రాలతో ఆ ప్రాంతాలకు చెందిన అనేక మంది యువకులు సెక్స్ చేసేందుకు రాత్రిపూట వచ్చిపోవడాన్ని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
వీరి ఆగడాలు మరింతగా పెరిగిపోవడంతో సెక్స్ దందా చేయసాగారు. దీంతోస్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. దీంతో వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని పది మంది హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.