Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

Advertiesment
crime

సెల్వి

, సోమవారం, 14 జులై 2025 (17:24 IST)
పిల్లలు పుట్టలేదని కట్టుకున్న భార్యను వదిలి.. ఆంటీతో ఆరేళ్లు సంసారం చేశాడు. ఆపై మరో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరినీ ఒకే ఇంట్లో వుంచి కాపురం చేశాడు. అయితే గొడవలు రావడంతో ఆంటీని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అంతే పక్కా ప్లాన్ ప్రకారం సుఫారీ ఇచ్చి ఆమెను లేపేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
ఖమ్మం జిల్లా కొణి జర్ల మండలం విక్రంనగర్ నుంచి కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఆమె కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామ శివారులోని అటవీ భూముల్లో గుర్తించారు. 
 
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం టేకుల తండాకు చెందిన భూక్యా మదన్‌కు ఏన్కూరు మండలానికి చెందిన మహిళతో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో పెళ్లయిన నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత భూక్యా హస్లీ (40)తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఆరేళ్లుగా వారి సహజీవనం కొనసాగుతుండగా... మూడేళ్ల క్రితం మరో మహిళను మదన్ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా హస్లీతో ఉంటున్న ఇంటికే తీసుకొచ్చాడు. కానీ గొడవలను ఆపలేకపోయాడు. 
 
హస్లీని హతమార్చేందుకు సహకరించాలని, రూ.లక్ష సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనుకున్నట్లే ఆమెను లేపేశాడు. అయితే హస్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడు మదన్‌ను అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో