Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

Advertiesment
Kumar Mangalam Birla

ఐవీఆర్

, సోమవారం, 14 జులై 2025 (14:33 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కొత్తగా తమ ఏఐ+ క్యాంపస్‌ను ప్రారంభించనున్నట్లు బిట్స్ పిలానీ ఛాన్సలర్ శ్రీ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. ప్రముఖ విద్యా సంస్థ అయిన బిట్స్ పిలానీ, తమ 2025 స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా ఉన్నత విద్య భవిష్యత్తు కోసం ఒక పరివర్తనాత్మక లక్ష్యంను వెల్లడించింది. ఈ వేడుకలలో ఛాన్సలర్ శ్రీ కుమార్ మంగళం బిర్లా మూడు ప్రధాన కార్యక్రమాలను ప్రకటించారు. అవి అమరావతిలో అత్యాధునిక ఏఐ+ క్యాంపస్ ప్రారంభం ఒకటి కాగా, ప్రాజెక్ట్ విస్తార్ కింద తమ క్యాంపస్‌లను విస్తరించడానికి, ఆధునీకరించడానికి చారిత్రాత్మక రూ. 1,219 కోట్ల పెట్టుబడి పెట్టటం, దాని ఎడ్ టెక్ ప్లాట్‌ఫామ్ బిట్స్ పిలానీ డిజిటల్ ను అధికారికంగా ఆవిష్కరించటం. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది బిట్స్ పిలానీ ప్రయాణంలో కీలకమైన క్షణం. ఆరు దశాబ్దాలుగా, విద్యా నైపుణ్యం, మార్గదర్శక ఆవిష్కరణ, దేశ నిర్మాణంకు ప్రతీకగా బిట్స్ పిలానీ నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ వేదికపై భారతదేశ వృద్ధి కథను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. తాజా కార్యక్రమాలు భౌతిక, డిజిటల్ రంగాలలో ఉన్నత విద్యను పునరావిష్కరించటంలో నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఈ ప్రయత్నాలు కేవలం వ్యాప్తి గురించి మాత్రమే కాకుండా, అభ్యాసకులను శక్తివంతం చేసే, ఆవిష్కరణలను పెంపొందించే, సమ్మిళిత వృద్ధికి ఇంధనం అందించే పరివర్తనాత్మక పర్యావరణ వ్యవస్థను నిర్మించడం గురించి అని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో కొత్తగా ప్రకటించిన ఏఐ+ క్యాంపస్‌ను 35 ఎకరాల విస్తీర్ణంలో తదుపరితరం ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లు, అగ్రశ్రేణి ప్రపంచ సంస్థలతో కొటుటెల్ డాక్టోరల్ డిగ్రీలు, ఏఐ/ఎంఎల్ , ఆవిష్కరణ మరియు స్ట్రాటజీలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఈ క్యాంపస్‌లో అనుభవపూర్వక & అనుకూల పాఠ్యాంశాలు, వ్యవస్థాపకత-మొదటి విధానం, సౌకర్యవంతమైన అభ్యాస మార్గాలు ఉంటాయి. ఈ క్యాంపస్ అభివృద్ధి రెండు దశల్లో జరుగుతుంది: మొదటి దశలో 3,000 మంది విద్యార్థులకు మద్దతు ఇస్తుంది, కోర్ అకడమిక్స్, విద్యార్థి జీవితంపై దృష్టి సారిస్తుంది; రెండవ దశ సామర్థ్యాన్ని 7,000+కి వ్యాప్తి చేస్తుంది, అధునాతన పరిశోధనా కేంద్రాలు, ప్రపంచ సహకార మండలాలు, అంకితమైన వ్యవస్థాపక కేంద్రాలను జోడిస్తుంది. 
 
ప్రాజెక్ట్ విస్తార్ కింద, బిట్స్ పిలాని తమ పిలాని, గోవా మరియు హైదరాబాద్ క్యాంపస్‌లలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికి రూ. 1,219 కోట్లను కేటాయించింది. ఇది దాని చరిత్రలో అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి. 2030-31 విద్యా సంవత్సరం నాటికి క్యాంపస్‌లలో విద్యార్థుల సంఖ్య 18,700 నుండి సుమారు 26,000 వరకు పెరుగుతుందని అంచనా. ఇన్‌స్టిట్యూట్ యొక్క స్వంత ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్, బిట్స్ పిలాని డిజిటల్‌ను ప్రారంభించడం ద్వారా  దాని విద్యా నైపుణ్యం యొక్క మహోన్నత ఫీచర్లను డిజిటల్ రంగంలోకి తీసుకువస్తుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో, బిట్స్ పిలానీ డిజిటల్ 32 ప్రోగ్రామ్‌లను (11 డిగ్రీలు మరియు 21 సర్టిఫికెట్‌లతో సహా) ప్రారంభించి, 100,000 మందికి పైగా అభ్యాసకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రాంగోపాల్ రావు మాట్లాడుతూ, “ఈ ప్రయత్నాలు బిట్స్ పిలానీ ప్రభావాన్ని పెంచడమే కాకుండా, ఉన్నత విద్య సమాజానికి ఎలా సేవ చేయగలదో కొత్త ప్రమాణాలను కూడా నిర్దేశిస్తాయి” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?