Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Advertiesment
TNR, Mahadev, Anupama Prakash, Deepthi Srirangam

దేవీ

, సోమవారం, 14 జులై 2025 (17:15 IST)
TNR, Mahadev, Anupama Prakash, Deepthi Srirangam
టి. నరసింహా రెడ్డి (టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం నాడు నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత టీఎన్‌ఆర్ మాట్లాడుతూ, ఎన్నో వ్యయ ప్రయాసలు పడితే గానీ ఓ మూవీ బయటకు రాదు. ఈ క్రమంలో నన్ను ఎంతో మంది మోసం చేశారు.  కానీ నేను ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు. నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన కథే. ఇందులోని ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ, నాగ భూషణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టీం అంతా కూడా నా స్నేహితులే. అందరం కలిసి ఈ మూవీని తీశాం. రాజన్న ఓ ఫైట్ సీక్వెన్స్‌ను బాగా తీశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
 
హీరోయిన్ అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ టీం అంతా ఓ కుటుంబంలా కలిసి పని చేశాం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
హీరోయిన్ దీప్తి శ్రీరంగం మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి సినిమా. నేను తెలుగమ్మాయిని. మేం చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మహదేవ్‌తో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ మెప్పించేలా ఉంటుంది’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు