Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీస్ సోదరులాలా.. మేం అన్నీ రికార్డు చేస్తున్నా... తస్మాత్ జాగ్రత్త... కేసీఆర్ వార్నింగ్

Advertiesment
kcrao

వరుణ్

, బుధవారం, 17 ఏప్రియల్ 2024 (10:42 IST)
తెలంగాణ పోలీసులకు మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి అంటూ బహిరంగంగా హెచ్చరించారు. పోలీస్ సోదరులారా.. మేం అన్నీ రికార్డు చేస్తున్నాం... ప్రజల స్పందన చూసి అయినా మారాలి అంటూ కోరారు. 
 
సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ, బీఆర్ఎస్ వారిని పోలీసులు సభకు రాకుండా ఆపేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ మిత్రులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని... మీ డ్యూటీ మీరు చేయండని సూచించారు. బీఆర్ఎస్ కూడా పదేళ్లు అధికారంలో ఉందని గుర్తు చేశారు. అమాయకులను బెదిరించడం... కొట్టడం... బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకేయడం సరికాదన్నారు. పోలీసులు తమ అరాచకాలను బంద్ చేయాలని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీ గతి ఏమవుతుందో చూడాలన్నారు. పదేళ్లు మేం అధికారంలో ఉండి ఒక్కరినైనా వేధించామా? అని ప్రశ్నించారు.
 
'పోలీస్ సోదరురాలా... మేం అన్నీ రికార్డ్ చేస్తున్నాం. ప్రజల స్పందన చూసి అయినా మారాలి. డీసీపీ మీరు మారాలి. లేదంటే ప్రజలు మీ మీదకు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త. మా కార్యకర్త... పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన మన తెలంగాణ ఉద్యమకారుడు దల్వాజీ మాధవరావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ రోజు అతను కరీంనగర్ జైల్లో ఉన్నాడు. డీజీపీకి గౌరవం ఉంటే మాధవరావు అంశంలో విచారణ జరిపించాలి. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే తస్మాత్ జాగ్రత్త. న్యాయస్థానం తలుపు తడతాం. మేం కూడా మస్తుగా చూశాము' అని హెచ్చరించారు. మేం ఎప్పుడూ పోలీసులతో దౌర్జన్యాలు చేయించలేదని కేసీఆర్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసిన అభ్యర్థి.. నాలుగో ర్యాంకు సాధించి ఫ్యామిలీకి సర్‌ప్రైజ్