Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే శాఖలో 14 వేల ఉద్యోగాలు : వేతనం రూ.21 వేల నుంచి రూ.35 వేలు

railway job

వరుణ్

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (15:00 IST)
రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇటీవల దాదాపు 14 వేలకు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వేశాఖ తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో 4,660 ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింకుపై క్లిక్ చేసి ఏప్రిల్ 15 నుంచి మే 14వరకు అప్లయ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో కీలక అంశాలను పరిశీలిస్తే, 
 
* మొత్తం పోస్టులు 4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్, 452 ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి.
 
అర్హతలు : కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు, ఎస్ఐ అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.
 
* ఎంపిక ప్రక్రియ : ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుం : ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళలు / ట్రాన్స్‌జెండర్/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్ చేస్తారు.
 
* వేతనం : ఎస్ఐ పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు.
రీజియన్ల వారీగా ఆయా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల సంఖ్య, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్‌లో అర్హత రాదనే మనస్తాపం.. ఐదో అంతస్థు నుంచి దూకేసిన యువకుడు